ప్రభుత్వం, ఆర్టీసీ నేతల చర్చలు సఫలం

ప్రభుత్వం, ఆర్టీసీ నేతల చర్చలు సఫలం

హైదరాబాద్ అక్షిత ప్రతినిధి 

తెలంగాణ సచివాలయంలో ఆర్టీసీ యూనియన్స్, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని ఉప కమిటీతో జరిగిన చర్చల్లో ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ కు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ప్రభుత్వంలో సంస్థ విలీనం, వేతన సవరణకు హామీ ఇచ్చారని తెలుస్తోంది. దీనిపై అధికారంగా గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉంది. ఇక తమ డిమాండ్స్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శనివారం ఉదయం మొదటి షిఫ్ట్ నుంచి ఆర్టీసీ ఉద్యోగులు యధావిధిగా డ్యూటీ ఎక్కనున్నారు. కాగా సమ్మె విరమణపై మరికాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ నిర్ణయంతో గత మూడు రోజులుగా ఎదురు చూస్తున్న ప్రయాణికులకు భారీ ఊరట లభించనుంది.

Comments are closed.

Breaking