మృతుడికి ఘన నివాళి.. 

మృతుడికి ఘన నివాళి.. 

కుటుంబానికి ధైర్యం చెప్పిన దైద రవీందర్

రామన్నపేట అక్షిత ప్రతినిధి 

నకిరేకల్ నియోజకవర్గం, కేతేపల్లి మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన గుండగాని తిరుపతయ్య గౌడ్ అనారోగ్యంతో మృతి చెందగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ఆయన మృతదేహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మృతుడి సేవలను స్మరించుకుంటూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ నాయకులు గార్లపాటి రవీందర్ రెడ్డి, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ సుంకర్ కేశయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు శివయ్య, చెరుకు నరసయ్య, కృష్ణ, జానయ్య, ఆవుల రాజు, సుంకర్ సైదులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking