యాదగిరిగుట్టలో సీపీ సజ్జనార్ కుటుంబ సమేతంగా దర్శనం
యాదాద్రి భువనగిరి అక్షిత బ్యూరో
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి అభిషేక పూజల్లో దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ వేదపండితులు వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. సజ్జనార్ రాకతో ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.