కొత్త పార్టీపై టీపీసీసీ నేత రవిచంద్ర విమర్శలు

కొత్త పార్టీపై టీపీసీసీ నేత రవిచంద్ర విమర్శలు

రామన్నపేట అక్షిత ప్రతినిధి 

కల్వకుంట్ల కవిత ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సేన (TRS) పార్టీపై టీపీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ పార్టీ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) కనుసన్నల్లోనే ఆవిర్భవించిందని ఆయన ఆరోపించారు. బీఆర్‌ఎస్‌కు తోకపార్టీగా టీఆర్‌ఎస్‌ను తీసుకొచ్చారని, రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు కొత్త పేరుతో మరో రాజకీయ వేదికను సృష్టిస్తున్నారని రవిచంద్ర అన్నారు. బీఆర్‌ఎస్ నాయకులపై రాష్ట్ర ప్రజల్లో నమ్మకం తగ్గిపోవడంతోనే ఈ కొత్త పార్టీ పేరుతో ముందుకు వస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఇప్పటికే బీఆర్‌ఎస్ పాలనపై స్పష్టమైన అభిప్రాయం ఏర్పరుచుకున్నారని, పేర్లు మార్చినా ప్రజాభిప్రాయాన్ని మార్చలేరని స్పష్టం చేశారు. రాజకీయ లాభాల కోసం కొత్త పేర్లతో ప్రజలను మోసం చేసే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking