ఇంద్రపాలనగరంలో న్యాయ విజ్ఞాన సదస్సు
రామన్నపేట అక్షిత ప్రతినిధి
రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామంలో మండల న్యాయ సేవా అధికార సంస్థ, మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి సరిత, ప్రిన్సిపల్ జడ్జి శిరీష, సీపీడీఓ సమీరా పాల్గొన్నారు.గ్రామ ప్రజలకు బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాలు, భవిష్యత్తులో తలెత్తే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు చట్టవిరుద్ధమని, వాటికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోక్సో చట్టం కింద నమోదయ్యే కేసులు, శిక్షలపై అంగన్వాడీ, ఆశా వర్కర్లకు వివరించి, సమాజంలో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.అవుట్‌రీచ్ సంస్థ ప్రతినిధి భాగ్యలక్ష్మి మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, చికిత్సా సదుపాయాలపై వివరించారు.గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్, ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, పంచాయతీ కార్యదర్శి రసూల్, అంగన్వాడీ సిబ్బంది, ఎంఎల్‌హెచ్‌పీ జ్యోతి, ఆశా వర్కర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.ప్యానెల్ సభ్యులు మామిడి వెంకట్‌రెడ్డి, డేవిడ్, వార్డ్ సభ్యులు వడ్లకొండ లక్ష్మి, పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.