చదువు ప్రాధాన్యతపై విద్యార్థులు అవగాహన కలిగించాలి.
గద్వాల, అక్షిత న్యూస్:
అక్షరాస్యతలో వెనుకబడ్డ జోగులాంబ గద్వాల జిల్లాలో విద్యార్థులు తమ చు ట్టుపక్కల వారికి చదువు ప్రాముఖ్యతను తెలియజేస్తూ అవగాహన కలిగించాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాలను పురస్కరించు కొని ఆదివారం బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. గద్వాల పాత బస్టాండ్ నుంచి వివిధ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులతో నిర్వహించిన బడిబాట ర్యాలీని అదనపు కలెక్టర్ నర్సింగరావు ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులు బడిబాట కార్యక్రమానికి సంబంధించిన ప్లకార్డు లను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ముం దుకు సాగారు. కృష్ణవేణి చౌరస్తా, రాజీవ్ మార్గం మీదుగా తిరిగి పాత బస్టాండ్ కు చేరుకున్న ర్యాలీ అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడారు. మన జిల్లా అక్షరా స్యతలో వెనుకబడిందని పేరును మార్చే లా బడి ఈడు పిల్లలు ప్రతి ఒక్కరూ చదు వుకునేలా కృషి చేయాల్సి ఉంద న్నారు. విద్యార్థులు ఖాళీ సమయాల్లో చదువుకోని పెద్దలకు విద్య నేర్పించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. చదువు మధ్యలో ఆపేసిన విద్యార్థులు సార్వత్రిక ఎస్ఎస్సి, ఇంటర్, ఇతర ఉన్నత విద్యా కోర్సులు అభ్యసించేం దుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంద న్నారు. సార్వత్రిక విద్యాసంస్థల్లో చేరే విద్యార్థులు తమ పని తాము చేసుకుం టూనే చదువుకునే వెసులుబాటు ఉంద న్నారు. చదువుకుంటే ప్రతి మనిషి ఎవరి పై ఆధారపడకుండా జీవించవచ్చని, జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొనే ధైర్య సాహసాలు వస్తాయ న్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, వసతి గృహాల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌక ర్యాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహి స్తున్నా మన్నారు. ప్రభుత్వం ఈ విద్యా సంవ త్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థు లకు మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని కల్పిస్తుందన్నారు. అనంతరం చదువు ప్రాముఖ్యతను వివరిస్తూ అధికారులు, విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్ర మంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధి కారి నుషిత, బీసీ సంక్షేమ శాఖ అధికారి అక్బర్ బాషా, ఏఎస్సిడబ్ల్యూఓ నాగరాజు, ధరూరు ఎంఈఓ రవీంద్రబాబు, సెక్టోరియల్ అధికారులు మైఖేల్, ప్రసాద్, జ్యోతి, ఇతర అధికారులు, వార్డెన్లు, వివిధ వసతిగృహాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.