మాజీ  ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన కార్యకర్తలు 

మాజీ  ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన కార్యకర్తలు 

మాజీ ఎమ్మెల్యే ధర్మారావు కోలుకోవాలని ఆలయాల్లో పూజలు

వరంగల్, అక్షిత బ్యూరో:

ఇటీవల ఆర్టీసీ సమ్మె దృష్ట్యా నర్సంపేటలో బస్టాండ్ సమీపంలో ఆత్మహత్య ప్రయత్నం చేసి ఆశువులు బాసిన కార్మికుడు శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులు అర్పించేందుకు వెళ్లిన బిజెపి హనుమకొండ మాజీ శాసనసభ్యులు మార్తినేని ధర్మారావు అక్కడ కొంత తోపులాట జరగడంతో అస్వస్థత కు గురై ఆపస్మానిక స్థితికి వెళ్లగా స్పందించిన కార్యకర్తలు వెంటనే హనుమకొండలోని రోహిణి హాస్పిటల్ లో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం వారికి గుండె సంబంధించి సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ సందర్భంగా స్టంట్ వేసినట్లు తెలిపారు ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగా ఉన్నదని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఎల్లప్పుడు కార్యకర్తల క్షేమం కోరుకొని పార్టీ ఎదుగుదలకు అనునిత్యం కృషి చేసిన ధర్మారావు త్వరగా కోలుకోవాలని అనేక ప్రాంతాల్లో దేవాలయాల్లో పూజలు హోమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రావుల సుదర్శన ఆధ్వర్యంలో హనుమకొండలోని రుద్రేశ్వర ఆలయంలో ( వేయి స్తంభాలాలయంలో) ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. వారి ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని భగవంతుని ఆశీస్సులు కార్యకర్తల ప్రేమాభిమానాలు వారిని త్వరగా కోలుకునేలా చేయాలని ఈ హోమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపినారు. ఈ కార్యక్రమంలో చొల్లేటి కృష్ణమాచారి గణపతిరాజు చింతల రఘుపతి వేద పండితులు వివిధ ప్రాంతాల కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking