చేనేత హక్కుల సాధన సభలో వెల్లంకి సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్
చౌటుప్పల్ అక్షిత ప్రతినిధి
చేనేత కార్మికుల హక్కుల సాధన కోసం చౌటుప్పల్‌లోని శ్రీ పద్మవంశీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సభలో వెల్లంకి గ్రామ సర్పంచ్ పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా చేనేత కార్మికుల ఐక్యత, వారి హక్కుల పరిరక్షణపై వక్తలు ప్రస్తావించారు. చేనేత రంగాన్ని అభివృద్ధి పరచడానికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. సభలో మాజీ ఎమ్మెల్సీ ఎల్. రమణ, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇరావత్రి అనిల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, మాజీ ఎమ్మెల్సీ చెరిపెల్లి సీతారాములు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు, జడ్పిటిసి కర్నాటి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.