ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు

ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు

యాదాద్రి భువనగిరి అక్షిత బ్యూరో

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వాసవి మాత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి అమ్మవారికి పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘాల అభ్యర్థన మేరకు వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వాసవి దేవాలయాలు, ఆర్యవైశ్య సత్రాల్లో ప్రభుత్వ లాంఛనాలతో వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె. ధనంజనేయులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పక్ష దశమి రోజున వాసవి మాత జయంతి జరుపుకుంటారని తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వాసవి మాత జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించడం పట్ల ఆర్యవైశ్య సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య వాసవి సంఘం అధ్యక్షుడు మహేష్, జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, ప్రాంతీయ కార్యదర్శి రమేష్, కార్యదర్శి హనుమంతరావు, సభ్యులు మనోహర్, వెంకటేశ్వర్లు, కృష్ణమూర్తి, శ్రీనివాస్, సోమన్న, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking