కంఠమహేశ్వర స్వామి ఆలయానికి పదివేల విరాళం
రామన్నపేట అక్షిత ప్రతినిధి
నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ సురమాంబ సమేత కంఠమహేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ కార్యక్రమానికి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం రూ.10,116 విరాళంగా సమర్పించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు దైద రవీందర్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో దుబ్బాక గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుండాల నర్సింహగౌడ్, మాజీ సర్పంచ్ గుండాల నర్సింహ, గుండాల సతీష్, మాజీ సర్పంచ్ గట్టు యాదయ్య, శెట్టి శేఖర్, బత్తుల రమేష్, బీఎన్ గౌడ్, గట్టు శ్రీనివాస్, గట్టు బాలు, గుండాల కిరణ్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

