వివేకానంద యూత్ ఆధ్వర్యంలో మాజీ సైనికుడు మాధవరెడ్డికి ఘన సన్మానం
21 ఏళ్లకు పైగా దేశసేవ చేసిన జవాన్‌కు అభినందనలు
రామన్నపేట అక్షిత ప్రతినిధి
రామన్నపేట మండలం ఇస్కిల్ల గ్రామానికి చెందిన జమాండ్ల మాధవరెడ్డి భారత సైన్యంలో 21 సంవత్సరాల 2 నెలలు సేవలందించి పదవీ విరమణ పొందిన సందర్భంగా వివేకానంద యూత్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ప్రజా జీవితంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు. దేశ రక్షణలో విశిష్ట సేవలు అందించిన మాధవరెడ్డి యువతకు ఆదర్శమని పలువురు కొనియాడారు. సైన్యంలో సేవల అనంతరం కూడా ప్రజా సేవలో ముందుండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రాపర్తి గణేష్, పిండి మల్లేష్, బందెల సంజీవ్, అశోక్ రెడ్డి, కళ్లెం ప్రవీణ్, మాసంపల్లి సత్యనారాయణ, పోలాస ఉపేంద్రచారి, రాజు రెడ్డి, నరేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, సిద్ధార్థ్, మణి, రవి, లింగస్వామి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.