గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు

గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు

రామకృష్ణాపూర్ ఎస్సై జె. శ్రీధర్ 

మందమర్రి, అక్షిత ప్రతినిధి:,

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు, మంచిర్యాల యాంటీ నార్కోటిక్స్ వింగ్ సిబ్బంది సమన్వయంతో నార్కోటిక్ స్నిపర్ డాగ్ స్క్వాడ్ సహాయంతో గురువారం బీజోన్, ఏరియా హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హోటళ్లు, పాన్ షాపులు, అనుమానాస్పద ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. గంజాయి, మత్తు పదార్థాలు, చిన్నపిల్లలకు మత్తు కలిగించే చాక్లెట్లు, గుట్కా, సిగరెట్లు వంటి నిషేధిత వస్తువులను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా తమ భవిష్యత్తును కాపాడుకోవాలని రామకృష్ణాపూర్ ఎస్సై జె. శ్రీధర్ సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఎలాంటి ఉపేక్ష లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.గంజాయి ఇతర మాదకద్రవ్యాల నియంత్రణతో పాటు యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడడం లక్ష్యంగా ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఎస్సై తెలిపారు.ఈ తనిఖీల్లో యాంటీ నార్కోటిక్ వింగ్ సిబ్బంది, రామకృష్ణాపూర్ పోలీసులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking