పెరికేడు పంట పొలాల్లో భారీ అగ్ని ప్రమాదం
– లక్షల్లో ఆస్తి నష్టం
రాయపర్తి అక్షిత ప్రతినిధి
మండలంలోని పెరికేడు గ్రామంలో గురువారం మధ్యాహ్నం పంట పొలాల్లో ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని పంట పొలాలు పామాయిల్ తోటలు టేకు చెట్లు మామిడి తోటలు అగ్నికి ఆహుతి అవడంతో పాటుగా వ్యవసాయ మోటార్లు స్టార్టర్లు డ్రిప్పు పైపులైన్లు గేట్ వాలులు పూర్తిగా కాలిపోయి రైతులకు లక్షల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. మంటలు అంటుకొని పొలాల్లో వ్యాపించడాన్ని గమనించిన రైతులు ఆర్పడానికి ప్రయత్నించిన తీవ్రమైన గాలులు వీయడంతో క్షణాల్లో మంటలు వ్యాపించి పదుల సంఖ్యల ఎకరాలలో వ్యాపించడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన భాషా బోయిన కుమార్ కు చెందిన మూడు లక్షల రూపాయల విలువ కల 8 ఎకరాల డ్రిప్ పైపులు తైవాన్ పంపులు 2 కొత్త పదాలు 20 గడ్డిమోపులు 200 గేట్ వాల్స్ మరియు అనేక వ్యవసాయ పనిముట్లు కాలిపోయాయి. కూన యాదగిరి పామాయిల్ తోటలో సుమారు 50 చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి సుతారి సోమయ్య బాబాయ్య రాజ్యానాయక్ లకు చెందిన టేకు చెట్లు మరియు ఇతర రైతుల వ్యవసాయ మోటర్లు స్టార్టర్లు పైపులు గడ్డిమోపులు కాలిపోయి తీవ్ర నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు.

