*కిష్టాపూర్ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో దొంగతనం*
*-సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ రవీందర్ నాయక్ ఎస్సై అశోక్*
లోకేశ్వరం, అక్షిత న్యూస్:
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గుర్తుతెలియని దొంగలు దొంగతనం చేసినట్లు లోకేశ్వరం ఎస్సై అశోక్, తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం రాత్రి ఒంటిగంట సమయంలో దొంగలు ఆలయ తాళం పగలగొట్టి ఆలయంలోకి చొరబడి దాదాపు రెండు లక్షలు విలువచేసే 50 తులాల వెండి,మూడు గ్రాముల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు.దీంతో సమాచారం అందుకున్న ముధోల్ సీఐ రవీందర్ నాయక్,ఆలయంలో దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు.

క్లోజ్ టీమ్ అధికారులు తనిఖీలు చేసే వేలిముద్రలను సేకరించారు. దీంతో ఆలయం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు లోకేశ్వరం ఎస్సై అశోక్,వివరించారు.