వర్షాకాలం వ్యాధులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి 

వర్షాకాలం వ్యాధులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి 

సమయపాలనతో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి

ఆరోగ్య సిబ్బందికి డీఎంహెచ్‌వో డా. కె. రాహుల్ సూచన

గుడిపల్లి, అక్షిత ప్రతినిధి : 

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాల్లో పనిచే సే వైద్య, ఆరోగ్య సిబ్బంది విధిగా సమయపాలన పాటిస్తూ ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. కె. రాహుల్ సూచించారు. దేవరకొండ డివిజన్ ఆరోగ్య సిబ్బందితో శుక్రవారం గుడిపల్లిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, గ్రామాలు, ఆవాసాల్లో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రతి గర్భిణిని ప్రారంభ దశలోనే నమోదు చేసి అవసరమైన పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అర్హులైన బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందించాలని చెప్పారు.వైద్యాధికారులు తమ పరిధిలోని ప్రభుత్వ వసతి గృహాలను క్రమం తప్పకుండా సందర్శించి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, ఆశా కార్యకర్తలు, ఎంఎల్‌హెచ్‌పీల సహకారంతో 30 ఏళ్లు పైబడిన వారందరికీ రక్తపోటు, మధుమేహం, సాధారణ క్యాన్సర్‌ల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందేలా చూడాలని సూచించారు.క్షయ, కుష్టు, మలేరియా, అసంక్రమణ వ్యాధుల నియంత్రణ, మాతా–శిశు ఆరోగ్యం, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాల పురోగతిని సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.సమావేశంలో ప్రోగ్రామ్ అధికారులు డా. కె.వి.ఎం. కృష్ణకుమారి, డా. దీప, డా. శంకర్, డా. కె. నాగేష్, డా. అబ్దుల్ జమీర్, శ్రీ జి. విష్ణు, ఆరోగ్య విద్య విస్తరణాధికారి ఎ. అంజయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking