నిరంతర విద్యుత్ సరఫరా కల్పించాలి……

నిరంతర విద్యుత్ సరఫరా కల్పించాలి……

–దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్

పెద్ద అడిశర్లపల్లి, అక్షిత ప్రతినిధి :

పెద్ద అడిశర్లపల్లి , గుడిపల్లి మండలాల్లో నిరంతర విద్యుత్ సరఫరా కల్పించాలి అని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట ఎక్స్ రోడ్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు ఉమ్మడి మండలాలైన పెద్ద అడిశర్లపల్లి, గుడిపల్లిలో విద్యుత్ కోతలు తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రైతులు వరి నాట్లు వేస్తున్న కీలక సమయంలో తరచూ విద్యుత్ సరఫరా నిలిపివేయడం వల్ల వ్యవసాయ పనులకు తీవ్ర అంతరాయం కలుగుతోందని పేర్కొన్నారు. అలాగే తాగునీటి అవసరాలు కూడా దెబ్బతింటున్నాయని అన్నారు.రైతుల సాగు, ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అంతరాయం లేకుండా 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని సంబంధిత విద్యుత్ శాఖ అధికారులను ఆయన కోరారు.ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి విద్యుత్ కోతలను వెంటనే నిలిపివేయాలని, లేనిపక్షంలో ఉమ్మడి మండలాల్లోని విద్యుత్ సబ్‌స్టేషన్లను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముట్టడించే కార్యక్రమాన్ని చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking