మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో బెటాలియన్ కానిస్టేబుల్ అరెస్ట్

*మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో బెటాలియన్ కానిస్టేబుల్ అరెస్ట్

*నిందితులకు ఆశ్రయం కల్పించినట్లు ఆరోపణ

*A-6 నిందితుడు వెంకటేష్‌ను అరెస్ట్ చేసిన*

*కొత్తగూడెం2టౌన్ పోలీసులు
కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ ఆదినారాయణ*

భద్రాద్రి కొత్తగూడెం/ అక్షిత బ్యూరో :

మైనర్ బాలికపై లైంగిక దాడికి సంబంధించిన కేసులో A-6 నిందితుడిగా ఉన్న బెటాలియన్ కానిస్టేబుల్ వెంకటేష్‌ను కొత్తగూడెం 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ శుక్రవారం వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడెం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడికి సంబంధించిన ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలో బాలికను కొత్తగూడెం పాత డిపో ప్రాంతంలోని ఓ గదికి తీసుకెళ్లిన సమయంలో, నిందితులకు ఆ గదిలో ఆశ్రయం కల్పించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బెటాలియన్ కానిస్టేబుల్ వెంకటేష్‌ను పోలీసులు A-6 నిందితుడిగా గుర్తించారు. ఈ ఘటనపై బాధిత బాలిక తల్లి ఈ నెల 11న కొత్తగూడెం 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తులో భాగంగా A-6 నిందితుడు వెంకటేష్‌ను కొత్తగూడెం 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ ఆదినారాయణ వెల్లడించారు. కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking