అత్యాధునిక ఆర్థోపెడిక్ వైద్య సేవల్లో ఏరియా ఆసుపత్రి మరో ముందడుగు

అత్యాధునిక ఆర్థోపెడిక్ వైద్య సేవల్లో ఏరియా ఆసుపత్రి మరో ముందడుగు

తొలిసారిగా టోటల్ హిప్ రీప్లేస్‌మెంట్ శస్త్రచికిత్స విజయవంతం

మందమర్రి, అక్షిత ప్రతినిధి:

రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల టోటల్ నీ రీప్లేస్‌మెంట్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన వైద్య బృందం, ఇప్పుడు ఆసుపత్రి చరిత్రలో తొలిసారిగా టోటల్ హిప్ రీప్లేస్‌మెంట్ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి మరో మైలురాయిని సృష్టించింది.డివై సీఎంఓ డా. మధు కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను ఆర్థోపెడిక్ నిపుణులు డా. సుహాసిని, డా. నరేష్, అనస్తీషియా నిపుణురాలు డా. మైత్రి తమ వైద్య బృందంతో కలిసి విజయవంతంగా నిర్వహించారు.ఈ శస్త్రచికిత్సను ఆర్కేఎన్‌టీ గనికి చెందిన శ్రీనివాస్ తండ్రి ఐలయ్యకు నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండి, వైద్యుల పర్యవేక్షణలో వేగంగా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.ఇప్పటికే టోటల్ నీ రీప్లేస్‌మెంట్ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించిన రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి, ఇప్పుడు తొలిసారిగా టోటల్ హిప్ రీప్లేస్‌మెంట్ శస్త్రచికిత్సను కూడా విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా అత్యాధునిక ఆర్థోపెడిక్ వైద్య సేవలను అందించే కేంద్రంగా మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది.ఈ సందర్భంగా డివై సీఎంఓ డా. మధు కుమార్ మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన, అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రిలో మరిన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధికి మందమర్రి జీఎం రాధాకృష్ణ, సీఎంవో డా. కిరణ్ రాజ్ అందిస్తున్న సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు.ఈ శస్త్రచికిత్స విజయవంతం కావడంలో ఆపరేషన్ థియేటర్ ఇన్‌చార్జి జ్యోతి సిస్టర్, థియేటర్ సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది ఇతర ఆసుపత్రి సిబ్బంది విశేషంగా సహకరించినట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking