నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలే సమర్థ ఆయుధం – డీసీపీ ఎగ్గడి భాస్కర్

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలే సమర్థ ఆయుధం

 – డీసీపీ ఎగ్గడి భాస్కర్

మందమర్రి, అక్షిత ప్రతినిధి:

రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొక్కలగుట్ట గ్రామంలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా 12 సీసీ కెమెరాలను శుక్రవారం ఏర్పాటు చేశారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా, ఐపీఎస్ ఆదేశాల మేరకు, మంచిర్యాల జిల్లా డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా జరుగుతుందని, నేరస్తులను త్వరగా గుర్తించి పట్టుకోవడంతో పాటు ప్రజల్లో భద్రతా భావం పెరుగుతుందని తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రజల భాగస్వామ్యంతో మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు.బొక్కలగుట్టలో సీసీ కెమెరాల ఏర్పాటుకు విశేష కృషి చేసిన రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లును డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఘనంగా సత్కరించి అభినందించారు. గ్రామ భద్రత కోసం ఆయన చూపిన చొరవ అభినందనీయమని ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ వి. కిరణ్ కుమార్, మందమర్రి సీఐ పి. రమేష్, రామకృష్ణాపూర్ ఎస్‌ఐ జె. శ్రీధర్, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking