ఫలించిన ప్రత్యేక ప్రార్థనలు యాగాలు

ఫలించిన ప్రత్యేక ప్రార్థనలు యాగాలు

– తాండూరులో దంచి కొడుతున్న వాన

– సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు

తాండూరు, అక్షిత ప్రతినిధి:

​ఫలించిన యాగాలు తాండూరులో దంచి కొడుతున్న వాన. మంగళవారం కురిసిన వర్షంతో చల్లబడిన వాతా వరణం ​పంటలకు జీవం, రైతన్నల కంట ఆనంద భాష్పాలు, భానుడి భగ భగలు శాంతించాయి. వర్షపు నీటి చుక్క కోసం ఆకాశం వైపు చూసిన రైతుల కంట ఆనంద భాష్పాలు కురిసాయి. వాన దేవుడికి తాండూరు ప్రజలు చేసిన యాగాలు, ప్రార్థనలు, ఫలించాయి. తాండూరు పట్టణంలో కురిసిన చిరుజల్లులు పట్టణాన్ని చల్ల పరచాయి. వానల్లేక ఎండి పోతున్న పంటలను చూసి కన్నీళ్లు పెట్టుకున్న రైతన్నలకు, ఈ వర్షం కొండంత ధైర్యా న్నిచ్చింది. పట్టణ మంతా చిరు చినుకుల ఆహ్లాదంతో పులకరించి పోయింది. తీవ్రమైన వేడి నుంచి ఉపశమనం లభించింది. వీధులన్ని నల్లటి మబ్బులతో పలక రింపుతో సరికొత్త కాంతితో మెరిసి పోయాయి.


Leave A Reply

Your email address will not be published.

Breaking