తిమ్మారెడ్డిపల్లిలో జిపిడిపి గ్రామసభ
గ్రామాభివృద్ధియే ప్రధాన లక్ష్యం..
సర్పంచ్ కొయ్యడ వెంకటేశం గౌడ్
కొండపాక, అక్షిత ప్రతినిధి :
కొండపాక మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం గ్రామ సర్పంచ్ కొయ్యడ వెంకటేశం గౌడ్ ఆధ్వర్యంలో జిపిడిపి గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి వార్డు నుండి సమస్యలను వార్డు మెంబర్స్ ద్వారా రాతపూర్వకంగా తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుండాలని ఏకైక లక్ష్యం కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిపిడిపి గ్రామసభలు నిర్వహిస్తున్నారన్నారు. గ్రామాల అభివృద్ధి మొదటగా గ్రామంలోని వార్డు నుండే మొదలవుతుందని ఈ సందర్భంగా తెలిపారు. గ్రామ ప్రజలు వార్డు మెంబర్స్ ద్వారా తెలిపిన సమస్యలను జిపిడిపి ఫండ్స్ ను ఉపయోగించి అన్ని శాఖల అధికారుల సమన్వయంతో అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ నర్సింలు, వార్డు సభ్యులు మల్లమారి జ్యోతి సంజీవ్, గద్దె రాజు, తుమ్మ నాగయ్య, లక్ష్మణ్ గౌడ్, పోలీస్ అధికారులు, అంగన్వాడి టీచర్లు పద్మ,రాధ, ఆశా కవిత, సి ఎ నాగలక్ష్మి, వివో నవిత, కారోబారి బాలనారాయణ, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.