ప్రభుత్వ పాఠశాల ఆషాడం గోరింటాకు బోనాల పండుగ సంబరాలు
దుబ్బాక అక్షిత ప్రతినిధి:
రాయపోల్ మండలం పరిధిలోని కొత్తపల్లి లో ప్రాథమికోన్నంత పాఠశాలలో శుక్రవారం ఆషాడ మాసం సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఆషాడ మాసం సందర్భంగా పాఠశాలల్లో గోరంట కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లలు స్వయంగా గోరింటాకు ను ఒకరి చేతులకు ఒకరు విద్యార్థులు పెడుతున్నారు. అనంతరం విద్యార్థులు ప్రతి ఆషాడ మాసంలో బోనాల పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు ఆషాడ మాస ప్రాముఖ్యతను మన వచ్చేతరం పిల్లలకి తెలియజేయాలని ఉద్దేశంతో పాఠశాలల ఆశాడ మాసం గోరింటాకు బోనాల సంబరాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వంశీకృష్ణ ,మల్లికార్జున్, రమేష్ ,మంజుల ,అనిత , మహాదేవి, సునీత, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు పాల్గొన్నారు