అమ్మవార్ల కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్

అమ్మవార్ల కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్

ఉప్పల్ అక్షిత ప్రతినిధి, ఆగస్టు 7:

మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కీసర సర్కిల్ పరిధిలోని జవహర్‌నగర్ డివిజన్ భాగ్యనగర్–జై శ్రీరామ్ నగర్ కాలనీలో నిర్వహించిన శ్రీ కనకదుర్గ, శ్రీ రేణుక ఎల్లమ్మ, శ్రీ నల్లపోచమ్మ అమ్మవార్ల కల్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ మహోత్సవానికి మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో నిర్వహించిన కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న నాయకులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవార్ల ఆశీస్సులు పొందారు. రాష్ట్రంలో సుఖశాంతులు నెలకొనాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో, ఆనందంగా జీవించాలని వారు ప్రార్థించారు. ప్రతి కుటుంబంపై అమ్మవార్ల కటాక్షం ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే అమ్మవారి ఉత్సవాలు సామాజిక ఐక్యతను, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక వేడుకల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయాలను భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జవహర్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శాంతి కోటేష్ గౌడ్, చంద్రపురి కాలనీ డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కల్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేశారు. భక్తుల కోసం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, అనంతరం ప్రసాద వితరణ నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking