అభివృద్ధి పనులపై జోనల్ కమిషనర్‌తో మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ భేటీ

అభివృద్ధి పనులపై జోనల్ కమిషనర్‌తో మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ భేటీ

ఉప్పల్ అక్షిత ప్రతినిధి, ఆగస్టు 7:

బోడుప్పల్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులపై మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ శుక్రవారం జోనల్ కమిషనర్ రాధిక గుప్తా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ బాబును కలిసి చర్చించారు. ఈ సందర్భంగా డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి ప్రజా సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని వేగంగా పరిష్కరించాలని కోరారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, అవసరమైన నిధులు, పరిపాలనా అనుమతులు త్వరితగతిన మంజూరు చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జోనల్ కమిషనర్ రాధిక గుప్తా అభివృద్ధి పనులపై సానుకూలంగా స్పందిస్తూ, సమస్యలను పరిశీలించి ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ సమావేశంలో డివిజన్ అధ్యక్షుడు బి. కళ్యాణ్, కర్రె రాజేష్, తుంగతుర్తి రవి, నాగారం కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking