ఉప్పల్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలి

ఉప్పల్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలి

జోన్ కమిషనర్‌కు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్ అక్షిత ప్రతినిధి, ఆగస్టు 7:

ఉప్పల్ నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను మంజూరు చేసి, పెండింగ్‌లో ఉన్న మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జోన్ కమిషనర్ రాధిక గుప్తను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు, డ్రైనేజీ వ్యవస్థ బలోపేతం వంటి పలు మౌలిక సదుపాయాల పనులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలంటే ఈ పనులను తక్షణమే చేపట్టాల్సిన అవసరం ఉందని వివరించారు. అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను కేటాయించి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి పనులను వేగవంతం చేయాలని జోన్ కమిషనర్‌ను ఎమ్మెల్యే కోరారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రతి కాలనీలో మౌలిక వసతులను మెరుగుపరచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. జోన్ కమిషనర్ రాధిక గుప్తకు సమర్పించిన వినతిపత్రంలో అభివృద్ధి పనుల ప్రాధాన్యతను వివరించిన ఎమ్మెల్యే, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సదుపాయాలు అందేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking