రేణుక ఎల్లమ్మ అమ్మ వారిని దర్శించుకున్న కంజర్ల విజయలక్ష్మి యాదవ్

రేణుక ఎల్లమ్మ అమ్మ వారిని దర్శించుకున్న కంజర్ల విజయలక్ష్మి యాదవ్

తాండూరు, అక్షిత ప్రతినిధి:

తాండూర్ పట్టణంలోని 23వ వార్డులో ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ దేవా లయాన్ని ప్రముఖ సామాజిక నాయకురాలు కంజర్ల విజయలక్ష్మి యాదవ్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయు రారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఆషాడ గోరింటాకు కార్యక్రమంలో స్థానిక మహిళలతో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ ఆషాడ మాసం ఆధ్యాత్మిక, సాంప్రదాయ విశిష్టతను కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking