8వ వార్డును దశల వారీగా అభివృద్ధి చేస్తాం

8వ వార్డును దశల వారీగా అభివృద్ధి చేస్తాం

మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డి

తాండూరు, అక్షిత ప్రతినిధి:

తాండూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డి శుక్రవారం పట్టణంలోని 8వ వార్డులో పర్యటించి స్థానిక సమస్యలను పరిశీ లించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్రెడ్డి మాట్లాడుతూ.. 8వ వార్డును దశలవారీగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభిస్తామని, ఇంకా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి వారి సహకారంతో పూర్తి చేస్తామని తెలిపారు. రాజీవ్, ఇంద్రమ్మ కాలనీ లను కాంగ్రెస్ పార్టీనే ఏర్పాటు చేసిందని, ఆయా కాలనీల అభివృద్ధిని కూడా కాంగ్రెస్ పార్టీయే చేపడు తుందని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ ఉదయ్ భాస్కర్ రెడ్డి, ఐఎన్టీయూసీ తాండూర్ నియోజకవర్గ అధ్యక్షుడు న్యాయవాది జిలాని, వార్డు ఇన్‌చార్జ్ సాయప్ప ముదిరాజ్, సీనియర్ నాయకులు నాసర్ ఖాన్, హర్షా ఖాన్, అమీనా బేగం, మోయిస్ ఖురేషి, యూసుఫ్‌తో పాటు కాలనీ వాసులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking