శ్రీ భవాని హోటల్ ప్రారంభం

శ్రీ భవాని హోటల్ ప్రారంభం

శుభాకాంక్షలు తెలిపిన గ్రామ ప్రజలు యువకులు

రామన్నపేట అక్షిత ప్రతినిధి

రామన్నపేట మండల కేంద్రంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ ఎదురుగా మా గ్రామ వాస్తవ్యులు చిప్పలపల్లి స్వామి నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ భవాని హోటల్ ప్రారంభమైంది. హోటల్ ప్రారంభం సందర్భంగా చిప్పలపల్లి స్వామిని శాలువాతో ఘనంగా సత్కరించి, ముత్యాల సాయిలు, ముత్యాల రమేష్, చిప్పలపల్లి జితేందర్‌లు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీ భవాని హోటల్ ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందిస్తూ మంచి ఆదరణ పొందాలని, వ్యాపారం విజయవంతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. నూతనంగా ప్రారంభమైన హోటల్‌కు స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన లభించాలని, నిర్వాహకులు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికులు పాల్గొని చిప్పలపల్లి స్వామికి శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking