తప్పిపోయిన వృద్ధురాలు క్షేమంగా గుర్తింపు

తప్పిపోయిన వృద్ధురాలు క్షేమంగా గుర్తింపు

మందమర్రి, అక్షిత ప్రతినిధి:

రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గాంధారి ఖిల్లాకు మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన గంగవ్వ అనే వృద్ధురాలు గురువారం మధ్యాహ్నం కుటుంబ సభ్యుల నుంచి తప్పిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే ఎస్‌ఐ జై శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఎస్సీసీ క్వారీ సఫారీ మార్గం సమీపంలో అటవీశాఖ కెమెరాల ఆధారంగా ఆమె ఆచూకీ గుర్తించారు.వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అటవీశాఖ సిబ్బంది అడవిలో ఉన్న గంగవ్వను సురక్షితంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సమన్వయంతో వేగంగా స్పందించిన పోలీసులు, అటవీశాఖ సిబ్బంది చర్యలను స్థానికులు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking