మృతుడి కుటుంబానికి షేక్ చాంద్ ఆర్థిక సాయం
రామన్నపేట, అక్షిత ప్రతినిధి
రామన్నపేట మండలానికి చెందిన కాటం నరసింహ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని టీఆర్ఎస్ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు, టీయూఎఫ్ మైనార్టీ సెల్ కన్వీనర్, హంస ఫౌండేషన్ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ చాంద్ శుక్రవారం పరామర్శించారు.ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన షేక్ చాంద్, తన వంతు సహాయంగా అర క్వింటాల్ బియ్యం, రూ.2,500 నగదును అందజేశారు. మృతుడి కుటుంబ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అన్ని విధాలుగా ఆర్థిక సహాయం అందించి అండగా నిలవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మహమ్మద్ జానీ, మల్లం సైదులు, కాటం రమేష్, కాటం నిర్మల, మమతతో పాటు మృతుడి కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు