జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో.. నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ
కోచింగ్ లో పాల్గొనే ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
అర్హత పరీక్ష ఆగస్టు 20న డీటీసీ ఆదిలాబాద్
ఇచ్చోడ అక్షిత న్యూస్ :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పోలీసు శాఖ ఉద్యోగ నియా మకాల్లో ఎస్సై, కానిస్టేబుల్ తదితర పోస్టులకు సిద్ధ మవుతున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఆదిలా బాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రాథమిక రాత పరీక్షకు ఉచిత కోచింగ్ అందించనున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శనివారం ఎస్పీ కార్యాల యంలో ఎస్పీ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా ఎస్పీ మాట్లాడారు. కోచింగ్ లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని, అర్హత పరీక్ష ఆగస్టు 20న డీటీసీ ఆదిలాబాద్ లో ఉంటుందని చెప్పారు. అర్హులైన అభ్యర్థులకు ఈనెల 24 ఉచిత కోచింగ్ ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. ఉచిత కోచింగ్‌లో పాల్గొనాలనుకునే అభ్యర్థులు పోస్టర్‌లోని క్యూఆర్ కోడ్ ద్వారా, లేదా లింక్,https://docs. google.com/forms/d/e 1FAIpQLSe GAX-3 uaNpI0odVBL5dEGsVGd9O1aV5XVOypGs-ryb9cgIwQ/viewform?usp=publish-editor పైనా ఇచ్చిన లింక్ ద్వారా లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 20న ఉదయం 11 గంటలకి డీటీసీ, ఆదిలాబాద్ (జిల్లా జైలు పక్కన) కోచింగ్ అర్హత పరీక్ష నిర్వహించను న్నట్లు ఎస్పీ తెలిపారు.ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను ఎంపిక చేసి, స్థానిక ఆదిలాబాద్ డిటిసి (డిస్టిక్ ట్రైనింగ్ సెంటర్) లో ఈనెల 24 నుంచి నిష్ణా తులైన ప్రైవేటు అధ్యాపకులచే కానిస్టేబుల్ ప్రిలిమి నరీ రాత పరీక్షకు కావలసిన అన్ని అంశాలలో ఉచిత శిక్షణ అందించనున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. శిక్షణతో పాటు అభ్యర్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్, నిపుణులచే మార్గదర్శకత్వం, రాత పరీక్షకు సంబం ధించిన ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించ నున్నట్లు తెలిపారు.
నోటిఫికేషన్‌లోని ముఖ్యమైన ఖాళీలు :
బాసర జోన్ పరిధిలో ఎస్సై పోస్టులు:
సివిల్ – 29, ఏఆర్ -2, ఫైర్-5, టీజీఎస్పీ-1, డిప్యూటీ జైలర్ (పురుషులు) -1.
ఆదిలాబాద్ జిల్లా పరిధిలో కానిస్టేబుల్ పోస్టులు
సివిల్ కానిస్టేబుల్స్ -130, ఏఆర్ కానిస్టేబుల్స్ -56, ఫైర్ కానిస్టేబుల్స్ -12, జైల్ వార్డెన్ (పురుషులు)- 4. రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోస్టులను కూడా నోటిఫికేషన్‌లో పొందుపరిచినట్లు ఎస్పీ తెలి పారు. పోలీసు శాఖలో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న యువతీ యువకులు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో అందిస్తున్న ఈ ఉచిత కోచింగ్ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ కోరారు. క్రమశిక్షణతో చదువుతూ, పట్టుదలతో శిక్షణను కొన సాగిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ కోచింగ్ నందు శిక్షణ తీసుకొని ప్రాథమిక పరీక్ష లో ఉత్తీర్ణత పొంది, మెయిన్స్ కి అర్హత సాధించిన అభ్య ర్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయంతో కూడిన శిక్షణ సైతం అందించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు పి. మౌనిక, సురేం దర్ రావు, ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, డీఎస్పీలు ఎల్. జీవన్ రెడ్డి, కమతం ఇంద్రవర్ధన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.