అక్రమ నిర్మాణాల తొలగింపు
నిర్మాణాన్ని జ్యోతి డైరీ ఎంప్లాయిస్ తొలగించిన మహిళలు..
మేడ్చల్,అక్షిత బ్యూరో:
రియల్ ఎస్టేట్ పుణ్యమాంటూ. భూములకు రెక్కలు రావడంతో చెరువులు కుంటలు ఎఫ్టిఎల్ లలో నిర్మాణాలు ప్రజా ప్రయోజనమైన కాలనీలలో పార్కులు ప్రభుత్వ స్థలాలపై గద్దల వాలిపోతున్నారు కబ్జారాళ్లు. ప్రజా అవసరాలకు వినియోగించిన ఏ స్థలమైన రహదారులైనా వడలడంలేదు రాత్రికి రాత్రి అక్రమ నిర్మాణాలు చేపట్టి అడ్డువచ్చిన వాళ్ళను బెదిరించి అమాయకులకు అమ్మి సొమ్ము చేసుకోవడం పరిపాటిగా మారింది ఈ క్రమంలో దుండిగల్ గండిమైసమ్మ మండల పరిధి బహదూరపల్లి సర్వే నంబర్ 133 లోని జ్యోతి డైరీ ఎంప్లాయిస్ భూమికి వెళ్లే దారిని ఆక్రమించి రాత్రికి రాత్రి ఫ్రీ కాస్ట్ వాల్ నిర్మించి కబ్జాకు ప్రయత్నించడంతో మహిళలు అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా జ్యోతి డైరీ ఎంప్లాయిస్ కాలనీ వాసులు మాట్లాడుతూ బహదూరపల్లి సర్వే నంబర్ 133 లో నీలి కృష్ణ దగ్గర ఎంప్లాయిస్ కాలనీ కోసం కొనుగోలు చేశామన్నారు,రహదారి నిర్మాణం కోసం గతంలో మున్సిపాలిటీ కి గిఫ్ట్ డిడ్ చేసినట్లు తెలిపారు.స్థానికంగా ఉండే కొందరు నాయకులు రాత్రికి రాత్రి ఫ్రీ కాస్ట్ వాల్ నిర్మించి కబ్జాకు యత్నించడంతో అడ్డుకున్నట్లు తెలిపారు,ప్రజాప్రయోజన స్థలాన్ని కబ్జాదారుల నుండి కాపాడాలని కాలనీ మహిళలు అధికారులకు విజ్ఞప్తి చేశారు..