పేద చిరు వ్యాపారులకు అండగా బీజేపీ

పేద చిరు వ్యాపారులకు అండగా బీజేపీ

డబ్బాల ముందు మొర్రం పోసిన వారిపై చర్యలు తీసుకోవాలి: ఏల్లేని సుధాకర్‌రావు

చిన్నంబావి, అక్షిత న్యూస్:

చిన్నంబావి మండల కేంద్రంలో నిన్న చిరు వ్యాపారుల డబ్బాల ముందు దౌర్జన్యంగా మొర్రం పోసి ఇబ్బందులకు గురిచేసిన బాధితులను మాజీ నాగర్‌కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ తాలూకా ఇన్‌చార్జి ఎల్లేని సుధాకర్‌రావు శనివారం చిన్నంబావి మండల బిజెపి కార్యకర్తలతో కలిసి పరామర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దేవాదాయ శాఖకు చెందిన 84 ఎకరాల భూములను పరిరక్షించడంతో పాటు, చిరు వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా 15 రోజుల్లో బోండ్రి ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులను డిమాండ్ చేశారు. పేద చిరు వ్యాపారులకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కురుమయ్య, రాష్ట్ర నాయకులు కురువ చిన్న మల్లన్న, దారాసింగ్, జిల్లా జనరల్ సెక్రటరీ జగ్గారి శ్రీధర్‌రెడ్డి, ఓబీసీ మోర్చా నాయకుడు చెన్నయ్య యాదవ్, సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking