‘ విద్యోదయ’ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ పట్టణంలో విద్యోదయ ఉన్నత పాఠశాలలో 1990-91 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులై పలు వృతుల్లో, ఉద్యోగాల్లో, హోదాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులంతా సమ్మేళనం నిర్వహించుకున్నారు. మిర్యాలగూడ పట్టణంలోని న్యూ వైష్ణవి గ్రాండ్ హోటల్ లో నిర్వహించిన కార్యక్రమంలో వారంతా పాల్గొన్నారు. విద్యార్థి దశలో వారి జ్ఞాపకాలను, మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. తమకు బోధించిన ఉపాధ్యాయులను, వారి సేవలను స్మరించుకున్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఒకరికొకరు సాయం అందించుకోవాలని కృత నిశ్చయం చేసుకున్నారు. తమను ఉత్తమ పౌరులుగా తీర్చిద్దిన విద్యోదయ విద్యా సంస్థల అధినేత, ప్రధానోపాధ్యాయులు పుప్పాల సత్యం, పూర్వ అధ్యాపకులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు పూర్వ విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రఫీ, మంజూర్, వీరబాబు, జావిద్, లక్ష్మయ్య, వెంకట రమణ, జయిని నవీన్, లక్ష్మయ్య, రవి, గయాజ్, కామేశ్వర్ రెడ్డి, సయ్యద్ అలీ, మూర్తుజా, రాం రెడ్డి,నవీన్, సైదయ్య,నాగరాజు, షఫియా, రజియా, సునీత, హైమా, కవిత, సుజాత, వేదశ్రీ, తదితరులు పాల్గొన్నారు.