బాల్యానికి’ ముళ్ల ‘ బంధం వద్దు
బాల్య వివాహాల నిరోధక లో సి ఎం పి ఓ పాత్ర
బాల్య వివాహాల నిషేధ చట్టం -2006
నాగర్ కర్నూల్ ,అక్షిత బ్యూరో:
బాల్య వివాహాల నిరోధించడంలో శ్రామిక వికాస కేంద్రం మరియు అధికారుల చొరవతో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.1992లో శ్రామిక వికాస కేంద్రం స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో మహిళా సంఘాలను ఏర్పాటు చేస్తూ వారి యొక్క పిల్లలు విద్యలో రాణించాలని అవగాహన కల్పిస్తూ, యుఎన్డిపి సహకారంతో గ్రామాలలో రాత్రి బడులు ఏర్పాటు చేసి 35 సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరు కూడా విద్యలో రాణించాలని గ్రామ గ్రామ వాలంటీర్ల నియమించి విద్య బోధిస్తూ ఎంతో మందిని అక్షరాస్యులుగా చేయడం జరిగింది. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో పాఠశాల నెలకొల్పడం జరిగింది అన్నారు. అనంతరం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన పై పెద్దకొత్తపల్లి మండలం లో ఆర్ బి సి. (Nclp) సి ఎల్ పి రెసిడెన్షియల్ బ్రిడ్జి కోర్సు సెంటర్లు బాచారం, వేడుక రావు పల్లి ,అంకి రావు పల్లి , చిన్న కారు పాముల, గ్రామాలలో ఎంతో మంది బడి బయట పిల్లలను విముక్తి కల్పించి విద్యలు అందించి పై తరగతులకు గురుకుల పాఠశాలలు, వివిధ ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ హాస్టల్ లో చేర్పించి వారికి పై తరగతుల్లో విద్యను కొనసాగించే విధంగా కృషి చేయడం జరిగింది. అనంతరం ప్రతి గ్రామగ్రామాన బాలల సంఘాలు ఏర్పాటు. గ్రామ బాలల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు, గ్రామైక్య సంఘాలు ,సామాజిక చైతన్య వేదిక లు, ఏర్పాటు చేసి వారి ద్వారా గ్రామాలలో ఉన్న సమస్యల, మరియు బాలల సమస్యలపై నిరంతరం కృషి చేస్తూ ముందుకు వస్తున్నాయి. అనంతరం బాల కార్మికులు ,బాల్యవివాహాలు, బాలల సంఘాలు, పై పని చేస్తూ నిరంతరం కృషి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా లోని కొల్లాపూర్ కోడేరు లింగాల వనపర్తి జిల్లాలోని పానుగల్ చిన్నంబావి మండలంలో మొత్తం 55 గ్రామాలలో పనిచేస్తూ నిరంతరం బాలలహక్కుల పై కృషి చేయడం జరుగుతుంది. గ్రామాలలో సదస్సులు. చట్టాలపై అవగాహన. గ్రామ బాలల పరిరక్షణ కమిటీలు. గ్రామైక్య సంఘాలు ఏర్పాటు చేసి బాలల హక్కులను రక్షించడంలో ఎలాంటి పాత్ర పోషించాలని విషయాలను వారికి అవగాహన కల్పించడం జరుగుతుంది. గ్రామ కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్, విలేజ్ లెవెల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ, సహకారంతో ఎంతోమంది బడి బయట పిల్లలను పాఠశాలలో వసతిగృహాలలో చేర్పించడం జరుగుతుంది ,
బాల్య వివాహాల నిరోధక చట్టం :-
బాల్య వివాహం చట్టప్రకారం నేరం, దారికి రెండు సంవత్సరాల వరకు కారాగార శిక్ష లేదా ఒక లక్ష రూపాయల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు. బాల్య వివాహములు రద్దు చేయుటకు కోర్టువారు ఉత్తర్వులు జారీ చేయుటకు అధికారం కలదు (సెక్షన్- 13 పి సి ఎం.ఎ-2006).
ఈ చట్టం క్రింది నేరములు కాగిజీ బుల్ నేరములు గా అనగా గుర్తించదగిన నేరములు గా మరియు బెయిల్ లేని నేరములు గా పరిగణించవచ్చు (సెక్షన్ -15 పి సి ఎం ఏ -2006)
ఈ చట్ట ప్రకారం ఈ క్రింది వారు శిక్షార్హమైన వారు:-
ఎవరైనా సరే ఏదైనా బాల్యవివాహం నిర్వహించేవారు ప్రోత్సహించేవారు సమర్థించేవారు (సెక్షన్ -15 పి సి ఎం ఏ -2006). ఒక బాలికను వివాహము చేసుకుంటున్న ,18 సంవత్సరాలు నిండిన ఏ వ్యక్తి అయినా శిక్షార్హులే. బాల్య వివాహము నిర్వహిస్తున్న లేదా సమర్పిస్తున్న లేదా వ్యతిరేకించ కపోయినా ఆ బిడ్డల యొక్క తల్లిదండ్రులు సంరక్షకులు లేదా ఏదేని సంస్థకు చెందిన సభ్యులు లేదు ఎవరైనా సరే ఆ బిడ్డల బాధ్యత వహించే వ్యక్తులు మొదలైన వారు శిక్షార్హులు.
బాధ్యత వహించే వారు కాక ఇతరుల లో శిక్షార్హులు:
ఇరు పక్షాలలో తల్లిదండ్రులు సంరక్షకులు, ఇరుపక్షాల సన్నిహితులు, ఇటువంటి వివాహానికి మద్దతిచ్చే సంఘ పెద్దలు, మధ్యవర్తులు, మత పెద్దలు గురువులు, ఇరుపక్షాలకు చెందిన ఇరుగుపొరుగు, ఆ వివాహాది కుదిర్చిన సంస్థలు లేదా వ్యక్తుల, పెళ్లికి సమయ పడే వారందరూ కూడా శిక్షార్హులే.
చైల్డ్ మ్యారేజ్ ప్రొఫెషన్ ఆఫీసర్ బాధ్యతలు:
బాల్య వివాహ నిరోధక అధికారి (సి ఎం పి ఓ) గా మీ పై, మీ జిల్లాకు సంబంధించినత వరకు. బాల్య వివాహాలను నిరోధించవలసిన ప్రముఖమైన బాధ్యత
మీ భుజస్కంధాలపై ఉన్నది . బాల్య వివాహము జరగక మునుపు లేదా విపత్కర పరిస్థితుల్లో తెలియకుండా జరిగినప్పటికీ. ఆయా బాధిత బాలల సంక్షేమం కోసం వారి విషయాలలో జోక్యం చేసుకోవడానికి మరియు వారి తరఫున వకాలత్ పుచ్చుకోవడానికి మీకు సర్వాధికారాలు ఉన్నాయి.
బాల్య వివాహ నివేదిక అధికారులు
గ్రామ పరిపాలన అధికారి / గ్రామ రెవిన్యూ అధికారి
పంచాయతీ కార్యదర్శి. మండల తాసిల్దార్. ఐసిడిఎస్ సూపర్వైజర్. బాలల అభివృద్ధి పథక అధికారి సిడిపిఓ. రెవిన్యూ డివిజనల్ అధికారి . జిల్లా కలెక్టర్.
బాల్య వివాహము జరుగక మునుపు అనగా జరగబోతుంది సమాచారం ఉన్నప్పుడు చేయవలసిందే :- సుధాకర్ తాసిల్దార్ లింగాల
ఇరుపక్షాల ఇళ్లకు వెళ్లి వారికి బాల్య వివాహం వల్ల కలిగే సాధకబాధకాలు వివరించి అది ఎంతటి శిక్షార్హులు వారికి తెలియజెప్పి వారి ప్రయత్నం విరమించుకోవటట్లు చేయాలి. ఇతర సంరక్షకులు బంధువులు మరియు సంఘ పెద్దలు తో మాట్లాడి వారికి బాల్య వివాహము ఎంతటి అవివేకము వివరించి వారికి ఆ వివాహ రద్దు కై ఒప్పించాలి.
ఆ బాధిత పిల్లలతో మాట్లాడి బాల్య వివాహ తదనంతర పరిణామాలు తద్వారా కలిగే ఇబ్బందులను వారికి గల వివాహాన్ని వ్యతిరేకించే హక్కులు తెలియజేయాలి. స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటూ పరిస్థితి బాగా కూలంకషంగా గమనించాలి. పోలీసు వారికి ఫిర్యాదు చేసి బాధ్యులను అరెస్టు చేయించాలి. సెక్షన్ 151/ సి ఆర్ పి సి కింద పోలీసు వారికి ఫిర్యాదు చేసి బాధ్యులను అరెస్టు చేయించాలి. ఆ ఆ తల్లిదండ్రులు వివాహానికి ఇంకా నిర్వహించదలిచినప్పుడు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కు ఫిర్యాదు చేసి సెక్షన్- 13 ప్రకారం ఆ వివాహాన్ని రద్దు చేయుటకు ఇంజక్షన్ ఆర్డర్స్ అనగా నిలుపుదల ఉత్తర్వులు తీసుకోవాలి.
పంచాయతీ సభ్యులు మరియు ఉపాధ్యాయులు
గ్రామ పంచాయతీ సభ్యులు ఉపాధ్యాయులుగా ఉన్న వారు వారి చుట్టూ ఉన్న సంఘంలో ఒక చిరు పరిచిత వ్యక్తిగా ఉంటారు. అంతేకాక బీరు ఈ చుట్టు నిర్వహణకై రాజ్యాంగ బద్ధతను కలిగియుంటారు. కేక అంతేకాక బాల్య వివాహాల విషయంలో వాటి నిరోధానికి మరియు వాటి బాధితులకు అండగా ఉండటం లోనూ సాధికారత సాక్ష్యాధారాల నిందితులకు శిక్ష పడటం సహాయ అధికారిగా పని చేయాల్సి ఉంది. చట్టంలోని సెక్షన్- 16 ప్రకారం సి ఎమ్ పి ఓ కు సహాయం చేయాలి. బాల్యవివాహాల విషయమై తల్లిదండ్రులకు వారి సమాజానికి అవగాహన కలిగించి ఆ బాలలకు తగు పాఠశాల విద్యా అందించడంలో సహాయంగా వుంటూ వారి రోజువారి పాఠశాల హాజరు పర్యవేక్షించాలి. అంతేగాక పైన పేర్కొన్న వీధులన్నీ పంచాయతీ సభ్యులు ఉపాధ్యాయులు కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది.
ఒక బాల్య వివాహం జరుగుతూ ఉన్నప్పుడు (సి ఎం పి ఓ )గా బాధ్యతలు:- లక్ష్మీ . సి డి పి ఓ. బల్మూర్.
సమాచారం అందిన వెంటనే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ గారికి ఫిర్యాదు చేసి నిలుపుదల ఉత్తర్వులు తీసుకోవాలి. ఆ వివాహానికి సంబంధించిన ఆధారాలు అనగా ఫోటోలు. ఆహ్వాన పత్రికలు. ఆ వివాహానికై బిల్లులు మొ ,,వి సంపాదించాలి. శిక్షార్హులు అనగా హాయ్ ఆ వివాహాన్ని నిర్వహిస్తున్న వారు సమర్పిస్తున్న వారు బాధ్యులు మొదలగునవి జాబితా తయారు చేయాలి. సెక్షన్ – 151/ సి ఆర్ పి సి కింద పోలీసు వారికి ఫిర్యాదు చేసి బాధ్యులను అరెస్టు చేయించాలి. ఒకవేళ బిడ్డ యొక్క సంమతికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా బలవంతగా వివాహం జరుగుతున్నప్పుడు . ఆ బిడ్డకు ప్రాణహాని ఉన్న వెంటనే ఆ బిడ్డలు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరు పరిచి. తర్వాత చిల్డ్రన్ హోమ్ కు లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు గల తాత్కాలిక బాలల నివాసములకు చేర్చాలి. ఒకసారి వారికి వైద్య సహాయం, న్యాయ సహాయం మరియు పునరుద్ధరణ కై సహాయం అందించాలి.
బాల్య వివాహం విషయంలో పోలీసుల పాత్ర:-
రవి ఎస్ఐ లింగాల
ఫిర్యాదు అందుకున్న వెంటనే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ -1973 ప్రకారం తీసుకోవలసిన చర్యలు పాటించాలి.
వెంటనే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టాలి. ఏ పోలీస్ అధికారి కూడా ఏ కారణం చేతను ఫిర్యాదులు నిరాకరించరాదు. మౌలిక మైనది అయినా రాతపూర్వకమైన అని పిర్యాదులు తప్పనిసరిగా వెంటనే ఎఫ్ఐఆర్ గా మార్చ బడాలి.
బాల్య వివాహానికి సంబంధించిన సాక్ష్యాధారాలను, సేకరించేందుకు తక్షణమే సి ఎం పి ఓ కు విషయాలు తెలియజేయాలి. తగిన ఉత్తర్వులు మెజిస్ట్రేట్ కు ఈ విషయాలు నివేదించాలి. నేరాన్ని గుర్తింపబడినది గాను మరియు బెయిల్ లేనీ నేరంగా పరిగణించి వెంటనే శిక్ష అర్హులను అరెస్టు చేయాలి.
బాలలను అరెస్టు చేయడం కనీ . సంకెళ్ళు వేయటం చేయరాదు . ఒకవేళ సి ఎం పి ఓ లేదా అందుకు సంబంధించిన అధికారులు ఎవరూ అందుబాటులో లేకపోతే సంఘటన అనగా బాల్య వివాహం జరిగిన జరుగుతున్న లేదా జరగబోతున్న ప్రదేశాన్ని సందర్శించి మైనర్ బాలికలను సౌ రక్షించుటకు తక్షణ చర్యలు చేపట్టాలి.
బాల్య వాహనాలు జరిగినట్లయితే వెంటనే చైల్డ్ లైన్1098 మరియు హెల్ప్ లైన్ 100 కి సమాచారం అందజేయాలి.
బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఫోక్స్-2012 :-
ఎస్ వి కే డైరెక్టర్ వై లక్ష్మణరావు
లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించేందుకు ఈ చట్టం రూపొందింది. మే 22 ,2012లో పార్లమెంటు ఈ చట్టాన్ని చేయగా. అదే ఏడాది నవంబర్ 14న బాలల దినోత్సవం రోజు నుంచి అమలులోకి వచ్చింది. ఈ చట్టంలో బాల బాలికలకు సమానమైన రక్షణ లభిస్తుంది. ఈ చట్ట ప్రకారం పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన ప్రతి కేసులు బాలల సంక్షేమ సమితి దృష్టికి 24 గంటల్లోగా తీసుకురావాలి. లైంగిక దాడికి గురైన పిల్లల వాగ్మూలం నమోదు చేసేటప్పుడు పోలీసులు సాధారణ దుస్తుల్లో ఉండాలి. దీనివల్ల పిల్లలు ఒత్తిడికి లోను కాకుండా ఉంటారు. బాలలు ఎంచుకున్న ప్రాంతాలలో వారు విశ్వాసం ఇచ్చేవారి సమక్షంలోనే వాగ్మూలం నమోదు చేయాలి. ఫోరెన్సిక్ సాక్షుల కోసం ఏదైనా పరీక్షలు చేయాల్సి వస్తే అవి వైద్యురాలు చేత మాత్రమే అది మైనర్ విశ్వసించే వ్యక్తి సమక్షంలో చేయాలి. మైనర్ పై అత్యాచారానికి పాల్పడితే కనీసం ఏడేళ్ల జైలు శిక్ష నుంచి గరిష్టంగా జీవిత ఖైదు తో పాటు జరిమానా కూడా విధించబడుతుంది. తదితర విషయాల పట్ల ప్రతి ఒక్కరు కూడా శిక్షార్హులు అవుతారు. ప్రతి ఒక్కరు కూడా పిల్లల రక్షణ కోసం కృషి చేయాలని కోరారు.