నిరుపేద విద్యార్థుల చదువులకు చేయూత ఇచ్చిన ఉప్పలవెంకటేష్
ఇబ్రహీంపట్నం, అక్షిత ప్రతినిధి :
రంగారెడ్డి జిల్లా ఆమన్ గల్ మండలం మంగల్ పల్లి గ్రామం బి.అఖిల అనే అమ్మాయి 10 వ తరగతి లో 9.5 మార్కులు సాధించింది. పై చదువులకు పేదరికంతో సతమతమవుతున్న అఖిలకు చదువుకోవాలని ఉన్న పేదరికంతో కుటుంబ సభ్యులు అఖిలను చదివించలేకపోయారు. దాసు ద్వారా తలకొండపల్లి జెడ్పిటిసి వెంకటేష్ దృష్టికి తీసుకుపోయిన వెంటనే స్పందించి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హైదరాబాద్ కృష్ణవేణి కళాశాలలో శనివారం అఖిల అనే అమ్మాయిని జాయిన్ చేశారు, అమ్మాయి కుటుంబ సభ్యులు వెంకటేష్ కు కృతజ్ఞలు తెలిపారు. అదేవిధంగా మాడ్గుల్ మండలం నల్లవారి పల్లి గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన మానస తండ్రి కృష్ణయ్య పై చదువుల కోసం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కృష్ణవేణి కాలేజీలో మానస, అఖిల అనే ఇద్దరమ్మాయిలను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కృష్ణ త్రివేణి కాలేజీలో చేర్పించారు. ఈ కార్యక్రమంలో నర్సంపల్లి సర్పంచ్ హనుమా నాయక్, దాసు, రుద్రాక్షల శ్రీను, సాయి, వంశీ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.