మెరుగైన సదుపాయాలు కల్పించాలి

హాస్టల్ ను సందర్శించిన ఎన్ ఎస్ యు ఐ నాయకులు

నాగర్ కర్నూల్ , అక్షిత బ్యూరో:

ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో లింగాల మండలంలో కొన్ని హాస్టళ్లను సందర్శించడం జరిగింది.లింగాల మండల్ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు సాయి యాదవ్ ఆధ్వర్యంలో లింగాల మండలంలో ఉన్న బాలుర ఎస్టీ హాస్టల్ను సొంత బిల్డింగ్ కావాలని మా యొక్క డిమాండ్ ఎందుకంటే ఈ యొక్క మండలంలో ట్రైబల్స్ ఎక్కువ ఉండడంతో వెంటనే పై అధికారులు స్పందించి సొంత బిల్డింగ్ మంజూరు చేయాలని కోరుతున్నాము లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఎన్ ఎస్ యు ఐ డిమాండ్ చేశారు.అదేవిధంగా లింగాల మండలంలో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ విద్యాలయం లో బాత్రూంలకు డోర్లు లేవు అదేవిధంగా వాటర్ సమస్య ఉంది జిల్లా అధికారులు స్పందించి సమస్యలను తీర్చాలని డిమాండ్ చేస్తున్నాము ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ తాలూకా అధ్యక్షులు రామావత్ సంతోష్. లింగాల మండల్ సోషల్ మీడియా ఇన్ఛార్జి వినోద్. జర్నల్ సెక్రెటరీ లడ్డు యాదవ్. ఎన్ ఎస్ యు ఐ అమ్రాబాద్ మండలం అధ్యక్షులు లింగేశ్వర్ యాదవ్. తాలూకా నాయకులు రంగాపూర్ శివ. గోపి. శశాంక్. అప్రోచ్ రవి .ధారారం వార్డ్ మెంబర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking