బాలల హక్కుల సాధనకు ఎస్వికే కృషి

సమస్యల పరిష్కారం కోసం -బాలల సంఘం
ఎస్ వి కె కమ్యూనిటీ ఆర్గనైజర్ లలిత

నాగర్ కర్నూల్, అక్షిత బ్యూరో:

సమస్యల పరిష్కారం కోసం బాలల సంఘం కృషి చేస్తుందని, ఎస్ వి కె కమ్యూనిటీ ఆర్గనైజర్ లలిత అన్నారు. శనివారం పాన్గల్ మండలంలోని బహదూర్ గూడెం గ్రామంలో బాలల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలల హక్కులు కాపాడటం కోసం ప్రతి గ్రామంలోనూ బాలల సంఘం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తొమ్మిది సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారి ఈ బాలల గ్రూప్లో ఉంటారని అన్నారు. బాలల హక్కులపై అవగాహన పెంచి, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందన్నారు. పిల్లలకు తమ రక్షణలో అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషించేలా బాలల సంఘాలు ఉన్నాయన్నారు. ప్రతి నెలకు ఈ సమావేశం నిర్ణయం తీసుకుంటారని. గ్రామంలో బాలలు ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించుకుంటారు. బడి మధ్యలో డ్రా పోర్ట్ పిల్లల సమాచారాన్ని గ్రామ బాలల పరిరక్షణ కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని. తదితర విషయాలపై చర్చించారు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాఠశాలకు వెళ్లే విధంగా ప్రోత్సహించాలని కోరారు. పాఠశాలకు వెళ్లే ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ బస్సు పాసులు తప్పనిసరిగా తీసుకోవాలని. డ్రాపౌట్ పిల్లలు ఎక్కడైనా ప్రభుత్వ హాస్టల్లో పాఠశాల లో చేరాలంటే హాస్టల్ అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఏ ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ కాకుండా పాఠశాలకు రెగ్యులర్గా వెళ్లాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking