చికిత్స పొందుతున్న వ్యక్తులను పరామర్శించిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

చికిత్స పొందుతున్న వ్యక్తులను పరామర్శించిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

నాగర్ కర్నూల్ , అక్షిత బ్యూరో:

నిన్న కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన చిన్నంబావి మండలం పెద్దమారు గ్రామానికి చెందిన కుమ్మరి భాస్కర్ మరియు కొడుకు శశి కుమార్ వారు హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే శనివారం స్వయంగా నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి తండ్రి కొడుకులను పరామర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకుని త్వరగా కోలుకుంటారని ధైర్యం చెప్పి, మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.వైద్య పరంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తానని ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎల్వొసీని మంజూరు చేస్తానని వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తో పాటు ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking