*మృతుని కుటుంబాన్ని పరామర్శించిన బిఎల్ఆర్*
అక్షిత ప్రతినిధి, వేములపల్లి :
వేములపల్లి మండల కేంద్రానికి చెందిన బొంగర్ల వెంకటయ్య 48 గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతిచెందాడు. విషయం తెలుసుకున్న మిర్యాలగూడ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి ఆదివారం మృతదేహన్ని సందర్శించి వెంకటయ్య మృత దేహం పై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రాగాడ సానుభూతిని వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో మండలకాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాలి కాంతరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టల కృపయ్య,డిసీసీ ఉపాధ్యక్షుడు రావు ఎల్లారెడ్డి , నాయకులు పుట్టల పెద్ద వెంకన్న ,నాగవెల్లి మధు, ఎస్.కె హాజీ ,శ్రీను, వినోద్ ,తదితరులుపాల్గొన్నారు.