బక్రీద్ పండుగ సందర్భంగా బుడెన్ షహీద్ బాబా దర్గాలో సందల్ సమర్పణ
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఖమ్మం నగరంలోని ఇండో ఇంగ్లీష్ పాఠశాల పక్కన గల బుడెన్ షహీద్ బాబా దర్గాలో సందల్ గంధం సమర్పించినట్లు ఎండి ఖమురుద్దీన్ మహమ్మద్ అహ్మెద్ అలి తెలిపారు.ఆదివారం బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఊరేగింపుతో సందల్ సమర్పించామని వారు అన్నారు. ఈ దర్గాలో సందల్ సమర్పించడం 1960 నుంచి ప్రతి బక్రీద్ పండగ రోజున సాయంత్రం శుక్రవారిపేటలోని ఎండి జిల్లాని ఇంటి నుంచి సందల్ ఊరేగింపుతో తీసి బుడెన్ షహీద్ బాబా దర్గాలో సమర్పిస్తామని వారు పేర్కొన్నారు.ఈ సందల్ ఊరేగింపు కార్యక్రమంలో ఎండి నసిరుద్దీన్ ఖాన్ సాబ్ ఎండి కరీం శంషు మహమ్మద్ అమన్ అలీ మహమ్మద్ అప్సర్ సమి ముజహిద్ జహీర్ గౌస్ ఖాజా ఫజల్ ఇంతియస్ ఇషాక్ పాషా తదితరులు పాల్గొన్నారు.