రసాయనిక ఎరువులు సరఫరా చేయాలి

రైతులకు విత్తనాలు రసాయనిక ఎరువులు ఉచితంగా సరఫరా చేయాలి

-ఆమ్ ఆద్మీ పార్టీ ఖమ్మం జిల్లా కన్వీనర్ నల్లమోతు తిరుమల రావు

ఖమ్మం/ అక్షిత బ్యూరో : తుపాను ఎడతెగని వర్షంమూలంగా పంటలు నష్టపోయిన తెలంగాణ రైతులకు విత్తనాలు రసాయనిక ఎరువులు యుద్ధప్రాతిపదికన ఉచితంగా అందజేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఖమ్మం జిల్లా కన్వీనర్ నల్లమోతు తిరుమల రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈమేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.ఈవిపత్తునుండి రైతులను ఆదుకోవాలని బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పై ఉందని ఆయన పేర్కొన్నారు.పొలాలు కొట్టుకుపోవడం తో పాటు అతివృష్టి మూలంగా పత్తి ఇతర పంటలు దారుణం గా దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు.వాయిదా వేసిన రెవెన్యూ సదస్సులు షెడ్యూల్ ప్రకటించాలని మండలస్థాయి లోనే గ్రామాలవారీగా ఫిర్యాదులు స్వీకరించి రసీదు లు ఇవ్వాలని రెవెన్యూ సదస్సులు జరిపి సాదాబైనామాలపేరుతో రెవెన్యూ దందాలో అక్రమంగా పొందిన దరణి పట్టాలు రద్దు చేయడంతో పాటు వాస్తవంగా భూమినుండి రికార్డులు కెక్కని భూములు కు పాస్ పుస్తకాలు జారీచేయాలని డిమాండ్ చేశారు.రెవెన్యూ అక్రమాలకు బాధ్యులైన రెవెన్యూ అధికారులను గుర్తించి ఉద్యోగాల నుంచి రిమూవ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రెవెన్యూ సదస్సులు నిష్పాక్షికంగా జరిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు.పకడ్బందీగా ఉన్న రెవెన్యూ రికార్డులు అక్రమాల పుట్ట గా తయారు చేసిన ఉద్యోగులు అధికారులు పైచర్య తోపాటు అక్రమాలు సరిదిద్ది సామాన్య మధ్యతరగతి రైతులకు న్యాయం చేయాలని సక్రమమైన పోడు సాగుదారులకు భూయాజమాన్య హక్కులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.రైతుల లక్ష రూపాయలు రుణ మాఫీ హామీని తక్షణమే అమలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ను ఆయన డిమాండ్ చేశారు.రైతుబందు ఆర్థిక సహాయం 10 ఎకరాలలోపు రైతులకు మాత్రమే పరిమితం చేయాలని రైతుబందు అందని వారికి తక్షణమే అందించాలని తిరుమలరావు డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking