16న సంచారజాతుల మహా ధర్నా

16 న సంచారజాతుల మహా ధర్నాను విజయవంతం చేయాలి

ఖమ్మం/ అక్షిత బ్యూరో : తెలంగాణ సంచారజాతుల హక్కుల కోసం హైదరాబాదులోనే ఇందిరా పార్కు వద్ద ఈ నెల 16 న మహాధర్నా కార్యక్రమం విజయవంతం చేయాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ కేవి కృష్ణారావు, రాష్ట్ర అధికార ప్రతినిధి వెన్నెల నాగరాజులు కోరారు.మహాధర్నా కార్యక్రమ గోడపత్రికను ఆవిష్కరించి మాట్లాడుతూ స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు దాటిన ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందక దుర్భర జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన ఈదాతే కమిషన్ రిపోర్ట్ ఆధారంగా 10% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల నుండి పది లక్షల వరకూ పూర్తిస్థాయి సబ్సిడీ రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షుడు జల్లి గణేష్ నర్రా ఎల్లయ్య పొదిలి నరసింహారావు గణాచారి, రవీందర్, ఖండం ఉపేందర్ కందుకూరి వెంకటేశ్వర్లు పవర్ రమేష్ కొంచెం వెంకటేశ్వర్లు వల్లెపు సోమరాజు బత్తుల తిరుమల రావు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా సంచారజాతుల అడహక్ కమిటీని ఎన్నుకున్నారు.కన్వీనర్ నర్ర ఎల్లయ్య కో కన్వీనర్ పొదిలి నరసింహారావు ఖండం ఉపేందర్ జల్లి రాములు కమిటీ సభ్యులుగా గణాచారి రవీందర్ పవర్ రమేష్ కందుకూరి వెంకటేశ్వర్లు కర్నాటి వెంకటేశ్వర్లును ఎన్నుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking