దశ దిశలా… స్వతంత్ర్య స్ఫూర్తి

దశ దిశలా…స్వతంత్ర స్ఫూర్తి

దేశం గర్వించేలా వజ్రోత్సవ వేడుకలు
ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

మిర్యాలగూడ,అక్షిత ప్రతినిధి : స్వాతంత్య్ర సమరయోధుల గొప్పదనాన్ని నేటితరానికి తెలియజేయడానికే స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకల్లో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపు గ్రౌండ్ నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు మిర్యాలగూడ సబ్ డివిజన్ పోలీస్ శాఖ, పలు విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన 2కె ఫ్రీడమ్ రన్ ను జెండా ఊపి భాస్కర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.దేశభక్తి సినిమా ప్రదర్శనతో పాటు ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు.15 రోజుల పాటు వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. ప్రజలంతా వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనాలని కోరారు. ప్రజలలో దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. భావితరాలకు సంపదను సృష్టించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ ఆలోచన మేరకు మొక్కలను నాటడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకునేలా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలను అగస్టు 8 నుంచి 22 వరకు రోజుకు ఒకటి చొప్పున నిర్వహిస్తామని భాస్కర్ రావు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, డీఎస్పీ వెంకటేశ్వర్ రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, మండల విద్యాధికారి బాలాజీ నాయక్, స్థానిక ప్రజా ప్రతినిధులు,ఇన్స్ పెక్టర్లు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

అవంతీపురం నుంచి
చిల్లేపల్లి వరకు 2కె రన్….

మిర్యాలగూడ మండలం అవంతిపురంలోని గిరిజన గురుకుల పాఠశాల నుంచి చిల్లేపల్లి టోల్ ప్లాజా నిర్వహించిన 2కె ఫ్రీడమ్ రన్ ను ఎమ్మెల్యే భాస్కర్ రావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం గిరిజన గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు స్వయంగా అల్పాహారం వడ్డించారు. అనంతరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు జ్ఞాపికలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహా రెడ్డి, ఎంపీపీ నూకల సరళ హన్మంత్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చిట్టిబాబు నాయక్, మండల పార్టీ అధ్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, రైతు బంధు సమితి మండల అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పులి జగదీష్, ఎంపీడీవో జ్యోతి లక్ష్మి, మిర్యాలగూడ రూరల్ సీఐ సత్యనారాయణ, విద్యార్ధులు, పోలీస్ అధికారులు, సర్పంచ్లు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking