*ప్రేమానుబంధాలకు ప్రతీక రక్షా బంధన్*
*ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొండ మల్లేశం గౌడ్*
నకిరేకల్, అక్షిత ప్రతినిధి :
ప్రేమానుబంధాలకు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ అని రామన్నపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొండ మల్లేశం అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో కొండ మల్లేశం గౌడ్ సోదరి గాదగాని మానస అన్న, తమ్ముడికి రాఖీ కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మల్లేశం గౌడ్ మాట్లాడుతూ రక్షాబంధన్ సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా వారి బాంధవ్యం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ అన్నారు. అన్నకు చెల్లి, చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండుగ అన్నారు. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ అని అభివర్ణించారు.