*ఇండోనేషియా(బాలి ద్వీపం)లో పరిణయం*
*-అంగరంగ వైభవంగా పొంగులేటి కుమార్తె వివాహ మహోత్సవం*
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
తెరాస రాష్ట్ర నాయకులు ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి-మాధురి దంపతుల కుమార్తె సప్నిరెడ్డి వివాహం రామసహాయం సురేందర్ రెడ్డి మనుమడు అర్జున్ రెడ్డితో ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి పొంగులేటి కుటుంబ సభ్యులతో పాటు రామసహాయం సురేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈనెల 17 న ఖమ్మం వైయస్సార్ నగర్ సమీపంలో గుట్ట పై 3 లక్షల మంది హాజరయ్యె విధంగా రిషెప్షన్ కి ఏర్పాట్లు చేస్తున్నారు.400 కోట్ల బడ్జెట్ తో తెలంగాణలో మొదటి సారి పోంగులేటీ సంచలనంగా పెళ్ళి వేడుకలు నిర్వహిస్తున్నారు.*