*పేదల ఆత్మ గౌరవం డబుల్ బెడ్ రూమ్
*అభివృద్ధి-ప్రజా సంక్షేమం ప్రభుత్వానికి రెండు కండ్లు*
*డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిరుపేదలకు దక్కలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన*
*ఇంటింటికి తిరిగి గృహప్రవేశ మహోత్సవంలో పాల్గొని, ఇండ్ల పట్టాలను అందజేసిన ఎమ్మెల్యే*
*రాఖీ పౌర్ణమి పండుగ శుభదినాన పేదలకు ఇండ్ల పంపిణీ*
*త్వరలో సొంత స్థలం ఉన్న పేద ప్రజలకు ఇండ్ల నిర్మాణానికి రూ.3లక్షలు*
*డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ, అక్షిత ప్రతినిధి
పేదలు ఆత్మ గౌరవంగా బ్రతికెందుకు సీఎం కెసిఆర్ డబుల్ బెడ్ రూమ్ పథకం తీసుకురావడం జరిగిందని శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం నడిగూడ మండలంలోని 6 కోట్ల వ్యయంతో కరివిరాల గ్రామంలో 50 ఇండ్లను, కాగితం రామచంద్రపురం 40ఇండ్లను, సిరిపురం గ్రామంలో 40 డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రారంభించారు. అనంతరం ప్రతి లబ్ధిదారుకి ఎమ్మెల్యే చీరను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా డబల్ బెడ్ రూమ్ ఇళ్లను అందించాలని లక్ష్యంతో నిర్మించారని ఆయన అన్నారు.పేదలు ఆత్మగౌరవం తో జీవించడానికి మన డబుల్ బెడ్ రూం ఇండ్లు అని ఆయన తెలిపారు.అభివృద్ధి-ప్రజా సంక్షేమం ప్రభుత్వానికి రెండు కండ్లు అని ఆయన అన్నారు.గత ప్రభుత్వాలు, ఇరుకు గదులు, ఇబ్బందులతో కూడిన నిధులు, అతి తక్కువ వ్యయంతో అరకొర వసతులతో ఇచ్చిన ఇండ్లు కాకుండా, సిఎం కెసిఆర్ తెలంగాణలోని నిరుపేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండే విధంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని ఆయన తెలిపారు.
ప్రభుత్వమే సొంతంగా నిర్మించి, లబ్ధిదారులకు అప్పగిస్తున్నదని ఆయన అన్నారు. ఇలా ఏ రాష్ట్రంలోనూ జరగడం లేదని ఆయన చెప్పారు. ప్రభుత్వం నిరుపేదల పక్షపాతిగా పని చేస్తుంది అని ఆయన తెలిపారు. అభివృద్ధి-సంక్షేమాలే రెండు కండ్లుగా కెసిఆర్ పాలన సాగిస్తున్నారని అని అన్నారు.పేదలు ఆత్మ గౌరవంగా బ్రతికెందుకు సీఎం కెసిఆర్ డబుల్ బెడ్ రూమ్ పథకం అమలు చేయడం జరుగుతుంది అని ఆయన గుర్తు చేశారు.నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ దక్కలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని ఆయన అన్నారు.త్వరలో సొంత స్థలం ఉన్న పేద ప్రజలకు ఇండ్ల నిర్మాణానికి రూ.3లక్షలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. డబల్ బెడ్ రూమ్ ఎంపికలో పారదర్శక పాటిస్తూ ఎంపిక చేసామని ఆయన తెలిపారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా చూస్తామని ఆయన అన్నారు. గత కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆయన అన్నారు. కొంతమందికి ఇండ్లు కట్టలేదు బిల్లులు ఎత్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఇల్లను పంపిణీ చేసిందని తెలిపారు. పేదలందరూ ఆత్మగౌరవంతో, అష్టైశ్వర్యాలతో, పాడిపంటలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఎంతో సహాయతమైన నిర్ణయంతో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లులు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి, టిఆర్ఎస్ ప్రభుత్వానికి నిండు ఆశీర్వాదం అందించాలని కోరారు. రాఖీ పౌర్ణమి పండుగ రోజు మాకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు జీవితాంతం రుణపడి ఉంటామని లబ్ధిదారులు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళలందరూ ఎమ్మెల్యే గారికి రాఖీ కట్టి, తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో కిషోర్ కుమార్,మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి,డిఎస్పి వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీపీ యతాకుల జ్యోతి మధుబాబు, జెడ్పిటిసి బాణాల కవిత నాగరాజు, సొసైటీ చైర్మన్లు రాజేష్, పుట్ట రమేష్, మండల పార్టీ అధ్యక్షులు పల్లా నర్సిరెడ్డి,, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉపేందర్ గౌడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కాసాని వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ సీనియర్ నాయకులుసురేష్ ప్రసాద్, పాలడుగు ప్రసాద్, అనంతుల ఆంజనేయులు, మాజీ జెడ్పిటిసి ఉపేందర్,ఎంపీటీసీ రమాదేవి రాంరెడ్డి, సర్పంచ్ మంచుకంటి వెంక రెడ్డి, ఎంపీటీసీ మాలతి శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ లక్ష్మీ బిక్షపతి, ఎంపిటిసి జ్యోతి సతీష్, సురేందర్ రెడ్డి, నాయకులు కమల్ రెడ్డి,నాగేశ్వరావు, మహేష్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీడీవో,తహశీల్దార,పీఆర్ డీఈ ల,ఆర్ డబ్ల్యూ ఎస్ డీఈ ,హౌసింగ్ డీఈ, ప్రభుత్వ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.