లిఫ్ట్ లకు విద్యుత్ సరఫరా చేయాలి
అక్షితప్రతినిధి, వేములపల్లి : నాగార్జున సాగర్ జలాశయం ఎడమకాల్వపై ఎత్తిపోతల పథకాలకు పగటిపూట మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారని రైతుల ప్రయోజనాల దృష్ట్యా రాత్రిపూట కూడా విద్యుత్తును సరఫరా చేయాలని లిప్ట్ రైతుల సంఘం అధ్యక్షుడు పాదూరి శశిధర్ రెడ్డి, లిఫ్ట్ చైర్మన్ మేకల రాంరెడ్డి లు కోరారు. శుక్రవారం మండలపరిధిలోని ఎత్తిపోతల పథకం .మోటర్లకు స్విచ్ ఆన్ చేసి మాట్లాడారు. లిప్ట్ లకు పగటిపూట మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నందున రైతులు నీటిని పొదుపుగా వాడుకొని చివరి ఆయకట్టు రైతులకు అదేవిధంగా సహకరించాలని కోరారు. ఈకార్యక్రమంలో లిప్ట్ రైతులు మారయ్య, నాగిరెడ్డి, సీతారాంరెడ్డి, వెంకట్ రెడ్డి ఆపరేటర్ సాగర్ రెడ్డి, లైన్ మెన్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.