నేడు 750 మీటర్ల జాతీయ పతాక ప్రదర్శన
మిర్యాలగూడ మున్సిపల్ చైర్మెన్ తిరునగరు భార్గవ్
అక్షిత ప్రతినిధి, మిర్యాలగూడ :
భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా పట్టణ ప్రజల్లో స్ఫూర్తిని నింపేందుకు గాను శనివారం మిర్యాలగూడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 750 మీటర్ల జాతీయ పతాక ప్రదర్శన నిర్వహించనున్నట్లు మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ తెలిపారు. శుక్రవారం స్థానికంగా ఆయన అక్షిత ప్రతినిధితో మాట్లాడుతూ మున్సిపాల్ కార్యాలయం నుండి రాజీవ్ చౌక్ వరకు నిర్వహించే భారీ జాతీయ పతాక ప్రదర్శనలో ప్రజాప్రతినిధులు, అధికారులు పురప్రముఖులు, సామాజిక వర్తక వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు యువజన మహిళ, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పట్టణ పౌరులు అధిక సంఖ్యలో పాల్గొని సమాఖ్య స్ఫూర్తిని చాటాలని ఆయన కోరారు.