జాతీయ గీతాలాపన… బైక్ ర్యాలీ

జాతీయ గీతాలాపన… బైక్ ర్యాలీ

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

ప్రాంతీయ దినపత్రిల సంఘం ఆధ్వర్యంలో జాతీయ గీతాలాపన బైక్ ర్యాలీ* హైదరాబాద్: ఆగస్టు 16 భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో భాగంగా తెలంగాణ “రాష్ట్ర ప్రభుత్వం సామూహిక జాతీయ గీతాలాపన” కు ఇచ్చిన పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్ర చిన్న, మధ్యతరహా దినపత్రిలు మరియు మ్యాగజైన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో పాల్గొనడం జరిగింది. సామూహికంగా జాతీయ గీతాలాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నుండి నెక్లెస్ రోడ్ వరకు జాతీయ పతాకాలను చేబూని బైక్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు యూసుఫ్ బాబు, ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అశోక్, కోశాధికారి ఆజాంఖాన్, అసోసియేషన్ ముఖ్యులు మొహమ్మద్ గౌస్, అఫ్రోజ్ ఖురేషి, గోళ్ళ రమేష్, మొహమ్మద్ ఖాసీం, వెంకటయ్య, జాన్ షాహిద్, అమన్, మాధవరెడ్డి, రాజిరెడ్డి, ఎర్రమిల్లి రామారావు రహమాన్, వెన్నరాజు, యాస శ్రీనివాస్, బాబూరావు, కూల్చారమ్ యాదగిరి, కల్లూరి సంజీవ్, నాయికోటి రవికాంత్, బ్యాగరి వెంకటస్వామి, పిల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. జైహింద్, ఇంక్విలాబ్ జిందాబాద్, భారత్ మాతాకి జై, వందేమాతరం, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, పత్రికాస్వేచ్ఛను పరిరక్షించుకుందాం, భారతీయుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేయడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking